గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 08:35:39

బైక్‌ను సిమెంటు లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం

బైక్‌ను సిమెంటు లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం

చిత్తూరు :  సిమెంట్‌ లారీ మృత్యురూపంలో దూసుకొచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన శంకరయ్య భార్య రెడ్డమ్మ, కుమారుడు అఖిల్‌తో కలిసి పిలేరు నుంచి కడప జిల్లాలోని రాయచోటికి బైక్‌పై బయల్దేరాడు.

గైరంపల్లి శివారు వద్దకు రాగానే అతివేగంగా దూసుకొచ్చిన సిమెంటు లోడు లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి వీరి పైనుంచి దూసుకెళ్లడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పిలేరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo