శనివారం 23 జనవరి 2021
Crime - Dec 17, 2020 , 08:18:31

కామారెడ్డిలో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి

కామారెడ్డిలో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తాపడటంతో ముగ్గురు మరణించారు. జిల్లాలోని బిచ్కుంద మండలం చిన్నదేవడాలో ఇవాళ ఉదయం ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. మృతులను తుకారం, సాయిలు, శంకర్‌గా గుర్తించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ట్యాంకర్‌ను తీసుకెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తాపడిందని తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo