మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 10, 2020 , 17:48:45

బాలికతో స్నేహంగా ఉంటున్నాడని కొట్టి చంపారు..

బాలికతో స్నేహంగా ఉంటున్నాడని కొట్టి చంపారు..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ దారుణం జరిగింది. బాలికతో స్నేహంగా ఉంటున్నాడని యువకుడిని ఆమె కుటుంబీకులు కొట్టి చంపారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఢిల్లీ వాయవ్య జిల్లా పోలీస్‌ కమిషనర్‌ విజయంత ఆర్య తెలిపారు. జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన రాహుల్‌ (18) అనే యువకుడు అదేప్రాంతానికి చెందిన బాలికతో కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నాడు. బాలిక కుటుంబీకులు వీరి స్నేహానికి అడ్డుచెప్పి రాహుల్‌ను హెచ్చరించారు. అయినా వినకపోవడంతో స్నేహితులతో కలిసి శనివారం దాడికి పాల్పడ్డారు.

అపస్మారక స్థితికి చేరిన అతడిని స్థానికులు జగ్జీవన్‌రామ్‌ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒంటిపై గాయాలేవీ కనిపించకపోవడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్లీహం చీలిపోవడమే రాహుల్‌ మృతి కారణమని వైద్యులు నిర్ధారించారు. దాడికి పాల్పడిన మహ్మద్‌రాజ్‌, మన్వర్‌ హుస్సేన్‌తోపాటు ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది రెండుకుటుంబాల మధ్య గొడవని, ఘటనకు ఎలాంటి రంగులు పులమొద్దని పోలీస్‌ కమిషనర్‌ విజయంత ఆర్య సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo