గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 10, 2020 , 15:03:27

నదిలో పడిపోయిన బస్సు.. ఇద్దరికి తీవ్రగాయాలు

నదిలో పడిపోయిన బస్సు.. ఇద్దరికి తీవ్రగాయాలు

విశాఖపట్నం : విశాఖ జిల్లాలో 16వ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి విశాఖ వెళ్తున్న బస్సు ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు జంక్షన్ వద్ద అదుపుతప్ప వరాహ నది బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బస్సు లోపల ఇరుక్కున ముగ్గురిని బయటకు తీశారు. వీరిలో ఇద్దరికి తీవ్రంగా గాయపడగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ పూటుగా మద్యం సేవించి బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గాయపడిన వారిని నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo