ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 08:52:32

వివాహితపై సామూహిక లైంగిక దాడి

వివాహితపై సామూహిక లైంగిక దాడి

పాల్ఘర్ :  మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లా నల్సోపారాలో మహిళపై ఈ నెల 11న సామూహిక లైంగిక దాడి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నలసోపారాలోని  రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రిక్షా డ్రైవర్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 11న అతడు ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతడి భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదించారు. ఈ నెల 14న ఆమె ధైర్యం చేసి విషయాన్ని భర్తకు చెప్పి అతడి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నల్లసోపారా పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ శ్రీరాంగ్ గోసావి తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 20 వరకు పోలీస్‌ కస్టడీ విధించినట్లు పేర్కొన్నారు.


logo