శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 22, 2020 , 18:05:34

చెరుకు తోట‌లో బ‌ర్రె.. 15 ఏళ్ల యువ‌కుడు హ‌త్య‌

చెరుకు తోట‌లో బ‌ర్రె.. 15 ఏళ్ల యువ‌కుడు హ‌త్య‌

ల‌క్నో : ఓ బ‌ర్రె మేత మేసుకుంటూ.. చెరుకు తోట‌లోకి వెళ్లింది. దీంతో బ‌ర్రె కాప‌రి అయిన 15 ఏళ్ల యువ‌కుడిని.. తోట య‌జ‌మానులు కొట్టి చంపారు. ఈ అమానుష ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని షాహ‌జ‌న్ పూర్ లో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

సింధౌలికి చెందిన కుల్దీప్ యాద‌వ్(15)కు ఓ బ‌ర్రె ఉంది. దాని మేత కోసం ప‌చ్చిక బ‌య‌ళ్ల‌కు తీసుకెళ్లాడు. బ‌ర్రెను ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో వ‌దిలేసి.. గ్రామానికి తిరిగొచ్చి స్నేహితుల‌తో యాద‌వ్ ఆడుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో బ‌ర్రె.. ఓ చెరుకు తోట‌లోకి వెళ్లింది. దీంతో బ‌ర్రెను తోట య‌జ‌మానులు సాధుసింగ్, ధ‌ర్మేంద్ర సింగ్ స్వాధీనం చేసుకున్నారు. 

త‌న బ‌ర్రెను అప్ప‌గించాల‌ని యాద‌వ్.. వారిని కోర‌డంతో ప‌రుష ప‌ద‌జాలంతో దూషించారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న సాధు సింగ్, ధ‌ర్మేంద్ర సింగ్ తో పాటు భూపీంద‌ర్ అనే యువ‌కుడు క‌లిసి.. యాద‌వ్ పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన అత‌ను స్పృహ కోల్పోయాడు. 

దీంతో యాద‌వ్ తండ్రి మ‌హేశ్.. అత‌న్ని తీసుకుని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. మెరుగైన చికిత్స నిమిత్తం బ‌రేలికీ తీసుకెళ్లాల‌ని సూచించారు స్థానిక వైద్యులు. బ‌రెలీకి తీసుకెళ్తున్న క్ర‌మంలోనే యాద‌వ్ క‌న్నుమూశాడు. 

మృతుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురు నిందితులు ప‌రారీలో ఉన్నారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


logo