శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 17:35:38

ఒడిశాలో 3.2 కిలోల బ్రౌన్‌ షుగర్‌ సీజ్‌

ఒడిశాలో 3.2 కిలోల బ్రౌన్‌ షుగర్‌ సీజ్‌

మయూర్‌భంజ్‌ : ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌లో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 3.285 కిలోల బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మయూర్‌భంజ్‌లో ఓ ఇంట్లో అక్రమంగా మాదకద్రవ్యాలు నిల్వ చేశారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి నిర్వహించినట్లు ఒడిశా పోలీసు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (నేరాలు, లాండ్‌ అండ్‌ ఆర్డర్‌) సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మొత్తం 15.648 కిలోల బ్రౌన్‌షుగర్‌ను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. 2013-2019 వరకు 7.5 కిలోల బ్రౌన్‌ షుగర్‌ను పట్టుబడగా కేవలం ఒక్క ఏడాదిలో 15.648 కిలోలు స్వాధీనం చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. రానున్నరోజుల్లోనూ బ్రౌన్‌ షుగర్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.

logo