ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 13, 2020 , 11:27:47

ప్రేమ పేరుతో మోసం.. మ‌హిళా న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య‌

ప్రేమ పేరుతో మోసం.. మ‌హిళా న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య‌

న్యూఢిల్లీ: ప‌్రేమ పేరుతో మోస‌పోయిన ఓ మ‌హిళా న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న ఢిల్లీకి స‌మీపంలోని గురుగ్రామ్‌లో సోమ‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. గురుగ్రామ్‌కు చెందిన మ‌హిళా న్యాయ‌వాది(28) పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యారు. అయితే పెళ్లి చేసుకుందామ‌ని న్యాయ‌వాది అడ‌గ్గా అత‌ను ముఖం చాటేస్తున్నాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు సోమ‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. బాధిత యువ‌తిని ప్రేమించిన వ్య‌క్తికి ఇప్ప‌టికే పెళ్లి అయిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి న్యాయ‌వాదిని ప్రేమిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo