మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 06:29:31

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసై.. ప్రాణాలు తీసుకున్నడు..

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసై.. ప్రాణాలు తీసుకున్నడు..

చెన్నై : ఆన్‌లైన్‌ గేమింగ్‌ కల్చర్‌ ఇటీవల బాగా పెరుగుతోంది.. వాటికి యువత బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకుంటూ అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమిళనాడు రాజధానిలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో సుమారు రూ.8లక్షలను పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన దినేశ్‌ (28) ఓ ప్రైవేట్‌ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. ఇంతకు ముందు దినేష్‌ తన స్నేహితుల నుంచి అప్పును తీసుకొని భారీ మొత్తాన్ని ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ ఆస్తిలో కొంత విక్రయించి వారికి డబ్బును సెటిల్‌ చేశారని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు. మళ్లీ దినేశ్‌ రూ.8లక్షలు అప్పులు చేసి జూదంలో పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య శరణ్య (22) నాలుగు నెలల గర్భవతి. ఇదిలా ఉండగా.. నెల రోజుల కిందట చెన్నైలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌ తాను పొదుపు చేసుకున్న డబ్బు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పోగొట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo