భద్రాచలంలో 28 కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఏసీపీ జి. వినీత్ తెలిపిన వివరాల ప్రకారం..గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు..భద్రాచలం పట్టణంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు భద్రాచలం నుంచి సారపాక వైపుగా వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద గల బ్యాగులను తనిఖీ చేయగా 28 కిలోల గంజాయి దొరికిందన్నారు.
దీని విలువ సుమారు రూ. 4,20,000 ఉంటుందని పేర్కొన్నారు. నిందితులు కొర్ర రవి, భగవాన్, కొర్ర రాజారావు, పంగి బాలమ్మగా గుర్తించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన వారని తెలిపారు. వీరంతా గంజాయిని సీలేరు నుంచి హైదరాబాద్‌కు తీసుకు వెళ్తున్నారని వివరాలను వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం పట్టణ సీఐ స్వామి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, ప్రొబెషనరీ ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మినీ మేడారం జాతరకు నిధులు విడుదల
మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కన్నెపల్లి ( లక్ష్మి ) పంపుహౌస్‌లో శవం లభ్యం
టూల్ కిట్ కేసులో దిశ రవికి బెయిల్
ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
తాజావార్తలు
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్‌గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి
- నందిగ్రామ్ నుంచి మమత పోటీ..
- గుడ్‌న్యూస్.. ఇక ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్
- ప్రయాణంతో.. ఒత్తిడి దూరం