శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 04, 2020 , 17:06:47

అత్త‌తో మేన‌ల్లుడి వివాహేత‌ర సంబంధం.. మామ హ‌త్య‌

అత్త‌తో మేన‌ల్లుడి వివాహేత‌ర సంబంధం.. మామ హ‌త్య‌

ల‌క్నో : అత్త‌తో మేన‌ల్లుడి వివాహేత‌రం సంబంధం మామ హ‌త్య‌కు దారి తీసింది. మామ‌తో పాటు ఆయ‌న కూతురును మేన‌ల్లుడు చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఘ‌జియాబాద్ లోని షాహిబాబాద్ లో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

అబ్దుల్లా(38), రుక్సానా దంప‌తులు. అయితే రుక్సానాకు మేన‌ల్లుడైన స‌ఫిర్ తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. గ‌త మూడేళ్ల నుంచి వీరిద్ద‌రూ అన్యోన్యంగా ఉంటున్నారు. విష‌యం తెలుసుకున్న అబ్దుల్లా.. రుక్సానాను మంద‌లించాడు. భ‌ర్త‌తో గొడ‌వ పెట్టుకున్న భార్య త‌న పిల్ల‌ల‌తో పుట్టింటికి వెళ్లింది. 

రుక్సానా సఫిర్ కు దూర‌మైంది. అబ్దుల్లా కార‌ణంగానే త‌న అత్త దూర‌మైంద‌ని భావించిన స‌ఫిర్ అత‌నిపై ప‌గ పెంచుకున్నాడు. మామ‌ను అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి అబ్దుల్లా నివాసంలోకి మేడ‌పై నుంచి వెళ్లాడు. గాఢ నిద్ర‌లో ఉన్న మామ‌ను క‌త్తితో పొడిచి చంపాడు. దీన్ని గ‌మ‌నించిన అబ్దుల్లా కూతురును కూడా మ‌ట్టుబెట్టాడు. ఆ త‌ర్వాత స‌ఫిర్ పారిపోయాడు. అయితే అబ్దుల్లా బంధువు ప‌ర్వేజ్.. శ‌నివారం ఉద‌యం అక్క‌డికి చేరుకున్నాడు. 15 నిమిషాల పాటు బెల్ నొక్కిన త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో.. మేడ‌పై నుంచి ఇంట్లోకి వెళ్లాడు. అబ్దుల్లాతో పాటు బాలిక ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయారు.

ప‌ర్వేజ్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. స‌ఫిర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. ఈ ఘ‌ట‌న‌లో రుక్సానా ప్ర‌మేయం లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.


logo