ఆదివారం 29 మార్చి 2020
Crime - Mar 25, 2020 , 07:05:49

రాచకొండలో 247 వాహనాలు సీజ్‌..

రాచకొండలో 247 వాహనాలు సీజ్‌..

హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. రోడ్లపై వచ్చిన వారిపై రాచకొండ పోలీసులు మంగళవారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచిన వారిపై పెట్టీ కేసులు నమోదు చేశారు.  ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ ఉత్తర్వులను పట్టించుకోని 139 మందిపై కేసులు, 11 ఈ పెట్టీ కేసులు నమోదు చేశారు. 150 కేసుల్లో 107 మందిని నిందితులుగా తేల్చారు. మొత్తం 247 ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 54 డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్షన్‌తో పాటు ఐపీసీ కింద అభియోగాలను మోపారు. 


logo