శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 09:18:34

రాజ‌స్థాన్‌లో భారీగా న‌ల్ల‌మందు ప‌ట్టివేత‌

రాజ‌స్థాన్‌లో భారీగా న‌ల్ల‌మందు ప‌ట్టివేత‌

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో పెద్ద‌మొత్తంలో న‌ల్ల‌మందు ప‌ట్టుబ‌డింది. రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న234 కిలోల‌ న‌ల్ల‌మందును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకుంది.  న‌ల్ల‌మందును ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని షాడి గ్రామంలో జూలై 19న త‌యారు చేశార‌ని, అక్క‌డి నుంచి రాజ‌స్థాన్‌కు అక్ర‌మంగా త‌ర‌సలిస్తున్నార‌ని, ఈ వ్య‌వ‌హారంలో ఇద్ద‌రిని అరెస్టు చేశామ‌ని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్ట‌ర్ కేపీఎస్ మ‌ల్హోత్రా తెలిపారు. 

వారిపై మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా కింద కేసు న‌మోదు చేశామ‌ని, వారి నుంచి ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. దేశంలో ఇంత‌పెద్ద‌మొత్తంలో న‌ల్ల‌మందును ప‌ట్టుకోవ‌డం ఈ ఏడాదిలో ఇదే మొద‌టిసార‌ని పేర్కొన్నారు. ఈ న‌ల్ల‌మందును ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చిత్తోర్‌లో సాగుచేశార‌ని, అక్క‌డి నుంచి జోధ్‌పూర్‌కు త‌ర‌లించార‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింద‌న్నారు.  


logo