Crime
- Nov 11, 2020 , 15:44:55
పెద్ద పులి దాడిలో ఆసిఫాబాద్ యువకుడు మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాం మండలంలోని దిగెడ గ్రామంలో పెద్ద పులి బీభత్సం సృష్టించింది. దిగెడ గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న గణేశ్(22)పై పెద్దపులి దాడి చేసింది. అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలోకి గణేశ్‌ను లాక్కెళ్లింది. గణేశ్‌తో పాటు మరో యువకుడు పశువులకు కాపలాగా ఉన్నాడు. అతను అరుచుకుంటూ గ్రామంలోకి పరుగెత్తుకొచ్చే సరికి, గ్రామస్తులంతా కలిసి అడవి వైపు వెళ్లారు. స్థానికుల అరుపులకు భయపడిన పెద్ద పులి గణేశ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. పెద్దపులి దాడిలో గణేశ్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తుల సమాచారంతో ఘటనాస్థలికి అటవీశాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. గణేశ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
- కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
- జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్!
- సైనీ.. ఇవాళ కూడా మైదానానికి దూరం
- కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..
- ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. రైళ్లు, విమానాలపై ప్రభావం
- ఆస్ట్రేలియా 369 ఆలౌట్
- మాజీ కేంద్రమంత్రి కమల్ మొరార్క కన్నుమూత
- ‘సిగ్నల్’లో సాంకేతిక సమస్యలు
MOST READ
TRENDING