శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 11:13:40

యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో మూటకట్టి..

యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో మూటకట్టి..

చంపారస్‌ : బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లాలూనగర్‌ ప్రాంతంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల ఒకచోట, శరీర భాగాలను బస్తాలో వేసి మరోచోట పడేశారు. లాలూనగర్‌కు చెందిన ముహమ్మద్ అబ్దుల్ ఖలీద్ హుస్సేన్ (22) శనివారం రాత్రి మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం లాలూనగర్‌ శివారులోని ఓ ఖాళీ స్థలంలో తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొండేన్ని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో మూట కట్టి సమీపంలోని మొక్కజొన్న కర్మాగారం పక్కన పడేశారు.

మృతుడి తండ్రి అక్తర్ హుస్సేన్ దుస్తుల ఆధారంగా మృతదేహం తన కుమారుడిదేనని గుర్తించారు. భూ వివాదం నేపథ్యంలో స్థానిక రాజకీయ నాయకురాలి భర్తే తన కొడుకుని హత్య చేయించాడని హుస్సేన్ ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ నాయకురాలితోపాటు ఆమె భర్తను సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులో లేరు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. భూ వివాదం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo