మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 06, 2020 , 20:18:32

మైనర్‌పై లైంగికదాడి చేసిన యువకుడికి పదేండ్ల జైలుశిక్ష

మైనర్‌పై లైంగికదాడి చేసిన యువకుడికి పదేండ్ల జైలుశిక్ష

హైదరాబాద్: సైదాబాద్‌లోని తన ఇంట్లో పద్నాలుగేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి హైదరాబాద్ కోర్టు పదేండ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. అమోత్ సేవా అలియాస్ శివ (22) వృత్తిరీత్యా డ్రైవర్. పోక్సో కింద నమోదైన కేసులో దోషిగా తేలడంతో అతడికి పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీతా కుంచల సోమవారం తీర్పుచెప్పారు.

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 506 కింద చేసిన నేరానికి కోర్టు అతడికి రెండేండ్ల శిక్ష విధించిందని, కోర్టు శివపై రూ.12,000 జరిమానా విధించినట్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె ప్రతాప్ రెడ్డి తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చైల్డ్‌లైన్ టీమ్ సభ్యుడు 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కాల్ అందుకున్నారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న డ్రైవర్ శివ తనను లైంగిక వైధిస్తున్నాడని, ఎవరికైనా సమాచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని  సదరు బాలిక పోలీసులకు తెలిపింది. చైల్డ్ లైన్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. 2017 జూన్‌లో శివపై కేసు నమోదైంది. 


logo