శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 19:35:33

భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భారీ గంజాయి స‌ర‌ఫ‌రాను పోలీసులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాచ‌లంలో చోటుచేసుకుంది. స్థానిక ప‌ట్ట‌ణ ఎస్ఐ మ‌హేశ్ కూన‌వ‌రం రోడ్ ఎన్‌టీఆర్ విగ్ర‌హం నుండి పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ స‌మ‌యంలో ఓ కారు అనుమానాస్ప‌దంగా వెళుతూ క‌నిపించింది. కారును ఆపి త‌నిఖీ చేయ‌గా గంజాయిని గుర్తించారు. 204 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ గంజాయి విలువ సుమారు రూ. 30 ల‌క్ష‌ల 60 వేలుగా స‌మాచారం. కారు డ్రైవ‌ర్ వాంకుడోతు బాల‌కుమార్‌(33)ను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo