మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 14, 2020 , 16:57:52

104 వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

104 వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

సిద్దిపేట ‌: జిల్లాలోని గజ్వేల్‌ మండలం జాలిగామ గ్రామం వద్ద సోమవారం 104 వాహనం ఢీ కొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగల కౌసల్య, ముసలికాళ్ల నర్సయ్య, ఆకుల నవ్యశ్రీ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిలబడి ఉన్నారు. అదే సమయంలో గజ్వేల్‌ నుంచి రాయపోల్‌ వెళ్తుతున్న 104 వాహనం వారిపైకి దూసుకెళ్లి పక్కనే ఉన్న అంబేద్కర్‌ విగ్రహం గద్దెను ఢీకొట్టింది. క్షతగాత్రులను వెంటనే గ్రామస్తులు చికిత్స కోసం గజ్వేల్‌కు తరలించారు. డ్రైవర్‌ సంతోష్‌గౌడ్‌ మద్యం సేవించి అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు తెలిపారు. 


logo