ఏవో అరుణ అచూకీ కోసం నదిలో గాలింపు

సంగారెడ్డి : జిల్లాలోని మనూరు మండలం రాయిపల్లి గ్రామ శివారులోని మంజీరా నది బ్రిడ్జి వద్ద కారు నిలిపి కనిపించకుండా పోయిన వ్యవసాయాధికారిణి అరుణ అచూకి కోసం పోలీసులు గత రెండు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం మంజీరా నదిలో కెమెరాల ద్వారా అచూకీ కోసం ప్రయత్నించినప్పటికి ఆమే జాడ కనిపించలేదు. దీంతో శనివారం గజ ఈతగాళ్లను రప్పించి నదిలో గాలిస్తున్నారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి, మనూరు ఎస్ఐ నరేందర్‌లు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఏవో అరుణ వంతెనపై నుంచి నదిలో దూకడం తాము చూశామని పలువురు మత్స్యకారులు పోలీసులకు సమాచారమిచ్చినట్టుగా చెబుతున్నప్పటికి నదిలో అరుణ జాడ మాత్రం కనిపించకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. మరో వైపు అరుణ జాడ తెలియక ఆమే కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఏది ఏమైనా వ్యవసాయాధికారిణి అరుణ వంతెనపై కారు నిలిపి కనిపించకపోవడం, ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులకు ఆమే ఆనవాళ్లేవి లభించకపోవడం కాస్త మిస్టరీగా మారింది.
తాజావార్తలు
- నేడు లక్ష మందికి టీకాలు!
- విద్యాలయాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
- పోలీస్ గ్రీవెన్స్‌కు ఆరు ఫిర్యాదులు
- ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల
- స్వదేశీ టీకానే వేసుకుంటా!
- ప్రమాద రహిత జిల్లాగా మార్చాలి : ఎస్పీ చేతన
- కొవిడ్ వ్యాక్సిన్‌పై భయం వద్దు
- ఆన్లైన్లో యోగా
- మళ్లీ ప్రగతిబాటలో ఆర్థికరంగం
- రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐదు మెడల్స్