శనివారం 16 జనవరి 2021
Crime - Nov 19, 2020 , 10:24:06

రూ.4.23 కోట్లు ఏటీఎం సొత్తు చోరీ.. రికవరీ చేసిన పోలీసులు

రూ.4.23 కోట్లు ఏటీఎం సొత్తు చోరీ.. రికవరీ చేసిన పోలీసులు

ముంబై : పాల్ఘర్‌లో ఏటీఎంలో రీఫిల్‌ చేయాల్సిన రూ.4.23 సొత్తును ఎత్తుకు వెళ్లగా.. డబ్బును రికవరీ చేయడంతో పాటు చోరీకి యత్నించిన క్యాష్‌వ్యాన్‌ డ్రైవర్‌ సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు రోహిత్ ఆరు, అక్షయ్ ప్రభాకర్ మొహతే, చంద్రకాంత్ గులాబ్ గైక్వాడ్ అని తెలిపారు. ఈ కేసు నవంబర్‌ 12న ఏటీఎంలకు సంబంధించిన రూ.4.25 నగదుతో వ్యాన్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కంపెనీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారని వసాయ్‌ విరార్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ) సంజయ్‌ పాటిల్‌ తెలిపారు.

ఈ మేరకు విచారణ జరిపి వ్యాన్‌ నుంచి రూ.2.33 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నామని, మిగతా సొమ్మును రూ.1.88 కోట్లు ఆర్నాలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలోనూ నిందితుడు నగదుతో పారిపోయేందుకు ప్రణాళికలు వేసుకున్నాడని, అతను తన స్నేహితులు కొంత మందికి తన ప్లాన్‌ గురించి చెప్పాడన్నారు. అతనికి చాలా మంది స్నేహితులు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించారని, చివరకు నిందితుడు పక్కా ప్లాన్‌ చేసుకొని నగదుతో పారిపోయాడని తెలిపారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేశామని, ప్రధాన నిందితుడు స్నేహితుల ఇండ్లలో ఉండగా.. అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.