శనివారం 16 జనవరి 2021
Crime - Oct 09, 2020 , 17:04:48

మంత్రాలతో కరోనా దూరం..అరెస్ట్ చేసిన పోలీసులు

మంత్రాలతో కరోనా దూరం..అరెస్ట్ చేసిన పోలీసులు

సిరిసిల్ల క్రైం : జిల్లా పోలీసులు దూకుడు పెంచుతున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. తాజాగా మంత్రాల నెపంతో కరోనా వైరస్ ని పారదోలుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణానికి చెందిన కంచర్ల కనకయ్య అనే వ్యక్తి  తాయత్తులు, మంత్రాల నెపంతో  అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. 

పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు జిల్లా ప్రజలే కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చే వారిని కూడా మంత్రాలు, తాయత్తులతో  కరోనాను నయం చేస్తానని చెప్పి ధనార్జనకు పాల్పడుతున్నాడని సీఐ రవికుమార్ తెలిపారు. అతని దగ్గరి నుంచి ఉంగరాలు, రంగు రాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని చెప్పారు.