శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 21:32:11

వరంగల్ జిల్లాలో విషాదం..పాకాల సరస్సులో పడి వ్యక్తి మృతి

వరంగల్ జిల్లాలో విషాదం..పాకాల సరస్సులో పడి వ్యక్తి మృతి

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసుల కథనం మేరకు..ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో నర్సంపేట పట్టణానికి చెందిన గంధం సాయి శంకర్ (22) ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు సరస్సులో పడి మృతి చెందినట్లు సమాచారం.  ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo