మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 14:09:28

వినాయక నిమజ్జనంలో అపశృతి .. నీటిలో మునిగి వ్యక్తి మృతి

 వినాయక నిమజ్జనంలో అపశృతి .. నీటిలో మునిగి వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి : వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామానికి చెందిన కడగల్ల శ్రీను(42) తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాగా, నిమజ్జనం చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామ శివారులోని తల్మోనికుంట చెరువులోకి తీసుకెళ్లారు.  

ఈ సందర్భంగా వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగి ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు.


logo