బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 13:54:54

గోనె సంచిలో డెడ్ బాడీ..!

గోనె సంచిలో డెడ్ బాడీ..!

రంగారెడ్డి : జిల్లాలోని జిల్లేడ్ చౌదరి గూడ మండల పరిధిలోని కాస్లాబాద్ గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి పాడు బడ్డ బావిలో వేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హత్య చేసి శరీర భాగాలను మూడు ముక్కలు చేసి తల ఓ చొట బాడీ (చెస్ట్) గోనె సంచిలో పెట్టి ,కాళ్లు మరో చోట పడేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చౌదర్ గూడ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన తట్టెపల్లి రాజుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి కొన్ని శరీర అవయవాల కోసం పోలీసులు వెతుకుతున్నారు.logo