శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 15:26:43

కరోనా సోకిందని బావిలో దూకాడు

కరోనా సోకిందని బావిలో దూకాడు

వరంగల్ రూరల్ : కరోనా సోకడంతో కొంతమంది అజ్ఞానంతో తమ ఆయుష్షును అర్ధాంతరంగా తీసుకుంటున్నారు. చికిత్స తీసుకోకుండానే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతూ వారి కుటుంబాలకు తీరని వేదనను కలిగిస్తున్నారు. ఇలాంటి విషాదకరమైన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నల్లబెల్లి మండలం మెడపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ  కరోనా సోకడంతో మనస్థాపానికి గురై నర్సంపేటలోని తన ఇంటి వెనుకాల ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మహబూబ్ అలీ కొద్ది కాలంగా నర్సంపేటలో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల రోజులుగా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు పొలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు వెతికే ప్రయత్నంలో తమ ఇంటి వెనుకాల ఉన్న బావిలో చూడగా శవమై కనిపించాడు.


logo