మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 13:27:24

చెరువులో పడి త్రండి, కొడుకుల మృతి

చెరువులో పడి త్రండి, కొడుకుల మృతి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పర్లపల్లి గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు(70) పుల్యాల మధుకర్(24) అనే తండ్రి, కొడుకులు శనివారం సాయంత్రం తమ పాడిబర్రె చెరువులోకి దిగగా తీసుక వచ్చేందుకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. చనిపోయిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మ‌ృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


logo