మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 13:23:13

మోజు తీర్చుకున్నాడు..పెండ్లంటే ముఖం చాటేశాడు

మోజు తీర్చుకున్నాడు..పెండ్లంటే ముఖం చాటేశాడు

భద్రాద్రి కొత్తగూడెం: పెండ్లయిన మహిళను ప్రేమిస్తున్నాని వెంట పడ్డాడు. భర్తను వదిలేసి వస్తే పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అది నమ్మి భర్తను వదిలేసి వచ్చిన ప్రియురాలితో కొద్ది రోజులు కాపురం చేశాడు. తీరా పెండ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు.ఈ ఘటన  జిల్లాలోని ములకలపల్లి మండలం ముత్యాంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ముత్యాంపాడు గ్రామానికి చెందిన తాటి రాజారావు, నాగమణి కుమారుడు ప్రవీణ్‌.. ఇదే గ్రామానికి చెందిన మడకం నర్సింహారావు భార్య అయిన మడకం జ్యోతిని గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాని వెంట పడ్డాడు.

వారి సంసారాన్ని విడదీసి జ్యోతితో కలిసి జ్యోతి సొంత ఊర్లో (వివాహేతర సంబంధం) కాపురం పెట్టాడు. కాగా, ఇప్పుడు జ్యోతి పెండ్లి చేసుకోమని అడుగగా ప్రవీణ్‌ ముఖం చాటేసాడు. దీంతో ముత్యాలంపాడులో ప్రవీణ్‌ ఇంటి ఎదుట జ్యోతి ధర్నాకు దిగింది. ఈ సంఘటనతో ప్రవీణ్‌ కుటుంబ సభ్యులు మొత్తం పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo