గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 02, 2020 , 19:52:54

రాఖీ కట్టడానికి వెళ్తూ..అనంతలోకాలకు

రాఖీ కట్టడానికి  వెళ్తూ..అనంతలోకాలకు

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని తాళ్లగూడెం స్టేజీ వద్ద విషాదం చోటు చేసుకుంది. సోదరులకు రాఖీ కడుదామని బయలు దేరిన ఆడ బిడ్డకు అదే రోజు ఆఖరి రోజు అవుతుందని ఊహించలేదు. కన్నవారికి ఇంటికి ఇంటికి ఎంతో ఉత్సాహంగా బయలు దేరిన ఆ బిడ్డను మృత్యువు మరో రూపంలో వెంటాడింది. యాదగిరిగుట్ట మండలంలోని తాళ్ల గూడెం స్టేజీ వద్ద ద్వి చక్ర వాహనం వెనుక చక్రంలో చున్నీ ఇరుక్కుని వర్షిత(25) అనే మహిళ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వరంగల్ కు  వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.logo