శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 18:57:50

అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రంగల్ రూరల్:  నిషేధిత గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్న వ్యక్తిని వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టయిన వ్యక్తి నుంచి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ మీడియాకు వివరాలను వెల్లడించారు.  గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు హైదరాబాద్ లోని ఉప్పల్ లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకొని బీదర్, ఇతర ప్రాంతాల నుంచి గుట్కా ప్యాకెట్లు తీసుకొస్తుంటాడు. ఆ సరుకును ఉప్పల్ గోడౌన్లో నిల్వ చేసి ఇతర జిల్లాల వారికి రహస్యంగా సరఫరా సరఫరా చేస్తున్నాడు. అతడిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు కూడా నమోదు అయ్యాయని తెలిపారు.

కొద్ది రోజులుగా నిందితుడిపై పోలీసులు నిఘా పెట్టారు. వర్ధన్నపేట నివాసి కొత్త నాగేశ్వరరావు కు గుట్కా అమ్మే క్రమంలో  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందాలు మధును అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు రూ. 60 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, హోండా ఆక్టివ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ లో నిల్వ ఉంచిన రూ.8.10 లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.logo