సోమవారం 03 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 18:13:31

సూసైడ్ చేసుకుంటూ .... వీడియో రికార్డ్ చేసింది

సూసైడ్ చేసుకుంటూ .... వీడియో రికార్డ్ చేసింది

నెల్లూరు : నెల్లూరులో దారుణం జరిగింది. రమ్య అనే డిగ్రీ చదువుతున్నవిద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంటూ వీడియో రికార్డ్ చేసింది. తమ బిడ్డ గది నుంచి ఎంత సేపటికీ  బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో తలుపులు పగులకొట్టి చూడగా రమ్య ఉరి వేసుకొని కనిపించగా... ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తోటి విద్యార్థుల వేధింపులతోనే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, ఫోన్ మెస్సేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని లైవ్‌ సూసైడ్‌‌ నెల్లూరులో సంచలనంగా మారింది.


logo