శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 05, 2020 , 19:50:40

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం : గుట్టుచప్పుడు కాకుండా ఒడిశాలోని మల్కనగిరి నుంచి హైదరాబాద్‌కు కారులో కొందరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా భద్రాద్రి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలంలోని బ్రిడ్జి రోడ్డులో ఉన్న చెక్‌పోస్టు వద్ద పట్టణ ఎస్సై బి.మహేశ్‌ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారును తనిఖీ చేశారు. కారులో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో ప్రయాణిస్తున్న షేక్‌ ముజామిల్‌, షేక్‌ దజ్రేజ్‌, షేక్‌ ఇమ్రాన్‌, ఎండీ రేష్మా అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

పట్టుబడిన గంజాయి 1.72 క్వింటాళ్లు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.25.80 లక్షలు ఉంటుందన్నారు. సరుకును ఒడిశాలోని మల్కనగిరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


logo