సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 04, 2020 , 18:45:39

ఐదుగురిని బలిగొన్న సెల్ఫీ పిచ్చి

ఐదుగురిని బలిగొన్న సెల్ఫీ పిచ్చి

ముంబై : మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాలోని జవార్‌ పట్టణానికి సమీపంలో ఉన్న కల్మండ్వి జలపాతంలో సెల్ఫీ పిచ్చి ఐదుగురిని బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 13 మంది జవార్ శివారులో ఉన్న జలపాతం వద్దకు సరాదాగా గడపడానికి వెళ్లారు. అందులో ఇద్దరు వ్యక్తులు జలపాతానికి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా జారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించడానికి మరో ముగ్గురు జలపాతంలోకి దూకగా వరద ఎక్కువగా ఉండడంతో ఐదుగురు కొట్టుకుపోయి మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు పోలీస్‌ అధికారి వివేకానంద్ కదమ్ తెలిపారు. చనిపోయిన వారిలో దేవేంద్ర వాగ్ (28), ప్రతామేశ్‌ చవాన్ (20), దేవేంద్ర ఫాల్తాంకర్ (19), నిమేశ్‌ పాటిల్ (28), రింకు భోయిర్ (22) ఉన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo