మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 02, 2020 , 18:42:55

గుండాల జలపాతంలో పడి యువకుడి మృతి

గుండాల జలపాతంలో పడి యువకుడి మృతి

ఆసిఫాబాద్ కుమ్రం భీం : గుండాల జలపాతంలో పడి యువకుడు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని తిర్యాని మండలం గుండాలలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన రంగు రాజు(20) అనే యువకుడు ఈ రోజు ఉదయం తన స్నేహితులతో కలిసి గుండాల జలపాతానికి వచ్చారు. స్నేహితులంతా కలిసి జలపాతంలో స్నానాలు చేస్తున్నారు.

అదే సమయంలో రాజు బండ రాయి పైనుండి ప్రమాదవశాత్తు కాలుజారి లోయలో పడిపోయాడు. వెంటనే స్నేహితులు స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి తలకు తీవ్ర గాయం కావడంతోనే రాజు మరణించాడని గ్రామస్తులు పేర్కొన్నారు. 


logo