శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 30, 2020 , 18:33:23

ఆదిలాబాద్‌ జిల్లాలో నిషేధిత గుట్కా పట్టివేత

ఆదిలాబాద్‌ జిల్లాలో నిషేధిత గుట్కా పట్టివేత

ఆదిలాబాద్‌ ‌: ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని పూసాయి సమీపంలో పోలీసులు నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. జైనథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ మల్లేశ్‌, ఎస్‌ఐ సాయివెంకన్నతో కలిసి  వివరాలు వెల్లడించారు. పూసాయి గ్రామ పెట్రోల్‌బంక్‌ వెనుక బిల్డర్‌ పరేష్‌రాని ఫాం హౌజ్‌లో నిషేధిత గుట్కా ఉన్నట్లు సమాచారం అందడంతో సోదాలు చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ గుట్కా విలువ సుమారుగా రూ.30 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన షమీయుల్లాఖాన్‌ ఈ గుట్కాను తరలిస్తున్నట్లు తెలిపారు. భూ యజమాని పరేష్‌రావు రాణితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి, గుట్కాను తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇన్నోవా వాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. కాగా.. ఇద్దరిని పట్టుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. 


logo