ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 30, 2020 , 13:36:59

ప్రాణం మీదికి తెచ్చిన అష్టాచెమ్మా

ప్రాణం మీదికి తెచ్చిన అష్టాచెమ్మా

ఖమ్మం : జిల్లాలోని బోనకల్లు రైల్వే స్టేషన్ ఆవరణలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ కు చెందిన వట్టికొండ నాగేశ్వరరావు, కోలా గోపి ఇద్దరూ కలిసి బెట్టింగ్ పెట్టుకొని లూడో గేమ్(అష్టాచెమ్మా) ఆడుతున్నారు. ఈ గేమ్ లో కోలా గోపి నాలుగు సార్లు ఓడిపోయాడు. పెట్టిన బెట్టింగ్ కంటే ఎక్కువ బెట్టింగ్ పెడతానని తనతో లూడో గేమ్ ఆడాలని  నాగేశ్వరావు పట్టుబడ్డాడు. 

మీ దగ్గర డబ్బులు లేవు గేమ్ ఎలా ఆడతావు అని ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఉన్న గోపి కోపోద్రిక్తుడై తన వద్ద ఉన్న మద్యం బాటిల్ ను పగలగొట్టి  నాగేశ్వరరావు పై దాడి చేశాడు. ఈ దాడిలో నాగేశ్వరరావు మెడకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలించారు. నాగేశ్వరరావు భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ కొండల్ రావు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.


logo