గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 28, 2020 , 15:20:39

పెద్దపల్లి జిల్లాలో ఆరు కిలోల గంజాయి పట్టివేత

పెద్దపల్లి జిల్లాలో ఆరు కిలోల గంజాయి పట్టివేత

పెద్దపల్లి : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపెల్లి ఎస్ఐ ఉపేందర్ రావు నేతృత్వంలో.. వాహనాల తనిఖీ నిర్వహించారు. మేడ్చల్ నుంచి కాగజ్ నగర్ వెళ్తున్న ఎరువుల లారీలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన పెద్ద పాపయ్య, మోహన్ గౌడ్ అనే వ్యక్తి నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

పెద్దపెల్లి జోన్ డీసీపీ రవీందర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐ ఉపేందర్ రావు నేతృత్వంలో ఐడీ కానిస్టేబుల్ మోసిన్ దుబాయ్ రమేష్ పెట్రోలింగ్ పార్టీ తనిఖీలు చేపట్టి చాకచక్యంగా పట్టుకున్నట్లు వివరించారు.  జిల్లాలో గంజాయి మట్కా లాంటి చెడు అలవాట్లకు యువత లోను కావొద్దని సూచించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.


logo