న్యూఢిల్లీ: ఒక ఆడ సింహానికి అడవి దున్న చుక్కలు చూపించింది. కొమ్ములతో దానిని గాల్లోకి పలుమార్లు విసిరికొట్టింది. దీంతో ఆ ఆడ సింహం అక్కడి నుంచి పారిపోయింది. డార్క్ సైడ్ ఆఫ్ నేచర్ అనే ట్విట్టర్ యూజర్ ఈ నెల 8న ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఒక దున్న కూర్చొని ఉండగా ఆడ సింహం దానిపై దాడి చేయబోయింది.
గమనించిన మరో అడవి దున్న ఒక్కసారిగా ఆ సింహంపైకి దూసుకొచ్చింది. తన కొమ్ములతో దానిని రెండు సార్లు గాల్లోకి విసిరికొట్టింది. కింద పడిన ఆ ఆడ సింహం బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు.