శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 24, 2020 , 15:58:17

యూరియా లారీ బోల్తా..క్లీనర్ మృతి

యూరియా లారీ బోల్తా..క్లీనర్ మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : యూరియా లోడ్ తో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో క్లీనర్ మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కెరిమెరి ఘాట్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌ వైపు యూరియా లోడ్ తో వస్తున్న లారీ అదువు తప్పి కెరిమెరి ఘాట్ లో బోల్తా పడింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా క్లీనర్ అమీర్ ఖాన్ (20) అక్కడికక్కడే మృతి చె౦దాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo