సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 21, 2020 , 20:10:03

ట్రాక్టర్ ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య

ట్రాక్టర్ ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్: ఇటీవల కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనలో గాయపడిన వీర్రాజు(20)అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వీర్రాజు తలకు తీవ్ర గాయాలవడంతో  ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెందాడు. ఖమ్మం లో ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతులసంఖ్య13కు  చేరింది. దీంతో  మృతుని స్వగ్రామం ఖమ్మం జిల్లా , ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామంలో మరోసారి విషాదఛాయలు అలుముకున్నాయి.  


logo