ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 01:28:12

నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్...తనువుచాలించిన బాధితురాలు

నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్...తనువుచాలించిన బాధితురాలు

చెన్నై: అభం శుభం తెలియని 15 ఏండ్ల బాలిక పై దుర్మార్గుల కళ్లు పడ్డాయి. ఆమె స్నానం చేస్తున్న సమయంలో చాటుగా వీడియో తీసిన కొందరుకిరాతకులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చెప్పినట్లు చేయకపోతే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ యువతి స్నానం చేస్తుండగా ఇంటి దగ్గర్లో నివసిస్తున్నముగ్గురు యువకులు రహస్యంగా వీడియో తీశారు. ఈ ముగ్గురూ వీడియోను బాలికకు చూపించి తమను లైంగికంగా తృప్తి పరచకపోతే ఇంటర్నెట్‌లో వీడియోను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పినట్లు చేయలేక పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమె శరీరం 90శాతం దెబ్బతిన్నదని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.


logo