ఆదివారం 05 జూలై 2020
Crime - May 22, 2020 , 09:00:45

నిజామాబాద్ లో గోడ కూలి ముగ్గురు మృతి

నిజామాబాద్ లో గోడ కూలి ముగ్గురు మృతి

నిజామాబాద్ : పొద్దంతా కష్టపడి అలసిపోయి సేదతీరుతున్న ఆ కుటుంబాన్నిమృత్యువు గోడ రూపంలో కబళించింది. నిద్రలోనే వారి ఆయువు అనంతాల్లో కలిసిపోయింది. ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి తండ్రి శ్రినివాస్ (35), తల్లి లక్ష్మి (30) వారి ఏడాదిన్నర కుమారుడు సాయి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని వర్ని మండలం తంగేలేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మి దంపతులు తన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలిపోవడంతో మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo