మంగళవారం 14 జూలై 2020
Crime - May 17, 2020 , 18:14:01

రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

ఖమ్మం :  ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద  చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాదేండ్  జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని  రాజమండ్రికి కోళ్ల దాన లోడుతో వెళ్తున్న లారీ.. పశ్చిమగోదావరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న చేపల లారీని సీతారాంపురం వద్ద తెల్లవారు జామున ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర కు చెందిన లారీ డ్రైవర్ అసీఫ్ (31) పశ్చిమగోదావరి జిల్లా డ్రైవర్ (వివారాలు తెలియాల్సి ఉంది) లారీల్లో ఇరుక్కొని మృతి చెందారు. ఒక క్లీనర్‌కు గాయాలయ్యాయి. కాగా డ్రైవర్లు  నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తున్నది.  సంఘటన స్థలానికి ఏఎస్ఐ నాగరాజు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo