ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం కేజీఎఫ్‌తో సెన్సేషనల్ హీరోగా మారాడు యష్. ఈ సినిమా తర్వాత యష్‌కు దేశ వ్యాప్తంగా అభిమాన గణం ఏర్పడింది. యష్ కు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చిన క్షణాలలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యష్ తన సినిమాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను సైతం అందులో షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
తాజాగా యష్‌కు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ సంఖ్య 5 మిలియన్స్‌కు చేరింది. కన్నడ నాట ఏ హీరో కూడా ఈ రికార్డ్ సాధించకపోవడంతో అభిమానులు ఫాస్టెస్ట్ 5 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకున్న ఏకైక హీరో యష్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జూలై 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.