బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 05, 2020 , 14:25:24

200 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

200 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

సూర్యాపేట : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట‌లో శ‌నివారం చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుండి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు. మద్దిరాల మండలం తూర్పుగూడ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జిల్లా టాస్క్‌ఫోర్స్, మద్దిరాల పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్య‌క్తులు ఇన్నోవా వాహనంలో గంజాయిని తరలిస్తుండగా గుర్తించి ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు.


logo