శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 14:18:08

అడవిలో కట్టెలు ఏరేందుకు వెళ్లిన యువతిపై ఇద్దరు లైంగిక దాడి

అడవిలో కట్టెలు ఏరేందుకు వెళ్లిన యువతిపై ఇద్దరు లైంగిక దాడి

ముజఫర్‌నగర్‌ : మహిళల రక్షణకు ఎన్నిచట్టాలు తెచ్చినా వారిపై అకృత్యాలు ఆగడం లేదు. వయోభేదం లేకుండా మృగాళ్లు వారిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌ జిల్లాలో  20 ఏండ్ల యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేశారు. ముజఫర్‌ నగర్‌ శివారు అటవీ ప్రాంతంలో ఓ యువతి తల్లితో కలిసి కట్టేలు ఏరేందుకు వెళ్లింది. బైక్‌పై వెళ్తున్న సల్మాన్‌, మయాంక్‌ అనే ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని చెరకు తోటకు లాకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి రాజ్‌కుమార్ రానా తెలిపారు. మరొక ఘటనలో ఓ దళిత మహిళను కులం పేరుతో దూషించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ హెచ్‌ఎన్ సింగ్ తెలిపారు. విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo