శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 01, 2020 , 13:12:30

చ‌దువుకోమ‌ని చెప్పినందుకు తుపాకీతో కాల్చుకున్నాడు..

చ‌దువుకోమ‌ని చెప్పినందుకు తుపాకీతో కాల్చుకున్నాడు..

చండీఘర్ : మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడ‌కుండా చ‌దువుకోమ‌ని చెప్పినందుకు ఓ విద్యార్థి తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌లో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. మాణిక్ శర్మ(20) అనే విద్యార్థి బీబీఏ ఫైన‌లియ‌ర్ చ‌దువుతున్నాడు. అత‌ను ఇటీవ‌ల నిర్వ‌హించిన పరీక్ష‌ల్లో మార్కులు త‌క్కువ వ‌చ్చాయి. చ‌ద‌వ‌డం మానేసి నిరంత‌రం ప‌బ్‌జీ గేమ్‌తో పాటు ఇత‌ర ఆట‌ల్లో మునిగి తేలుతున్నాడు.

ఎగ్జామ్స్‌లో మార్కులు త‌క్కువ రావ‌డం.. ఎల్ల‌ప్పుడూ మొబైల్‌లో గేమ్స్ ఆడ‌డం తండ్రి చంద‌ర్ శేఖ‌ర్‌కు కోపం తెప్పించింది. ఫోన్ ప‌క్క‌న పెట్టేసి.. చదువు మీద దృష్టి సారించాల‌ని తండ్రి కుమారుడిని మంద‌లించాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మాణిక్ శ‌ర్మ గురువారం ఉదయం ఇంట్లో ఉన్న సర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకున్నాడు. శర్మ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. 

తండ్రి చంద‌ర్ శేఖ‌ర్ రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌లో ప‌ని చేస్తున్నాడు. సొంతంగా ఓ మెడిక‌ల్ దుకాణాన్ని నిర్వ‌హిస్తున్నాడు. శేఖ‌ర్‌కు శ‌ర్మ ఒక్క‌రే సంతానం. కుమారుడి ఆత్మ‌హ‌త్య‌పై శేఖ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo