గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 18, 2020 , 15:24:34

9 కిలోల గంజాయితో పట్టుబడిన మహిళలు..

9 కిలోల గంజాయితో పట్టుబడిన మహిళలు..

ముంబై : ముంబైలో అథేరీ ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి  పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తారసపడటంతో వారిని విచారించారు. వారి వద్ద 9 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదేప్రాంతానికి చెందిన గౌరీ, బర్కాగా గుర్తించినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి విజయ్‌ బల్గే పేర్కొన్నారు.  స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో 2.25 లక్షల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోదక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరికి గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు.. తదితర వివరాలన్నీ విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo