ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి దారుణ హత్య

ఛత్తీస్‌గఢ్ : ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. ఛతీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జంగల పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతులను గనిరాం కొర్స, గోపాల్ కుడియంగా పోలీసులు గుర్తించారు. ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధ్రువీకరించారు. గంగలూర్ పరిధిలో కుర్చేలి గ్రామంలో ఇటీవల 16 మందిని మావోయిస్టులు హతమార్చారు.
గత నెల 5న మోటపాల్ - పూనూర్ సమీపంలో నలుగురిని హతమార్చి 25 మందిని అపహరించారు. ప్రజాకోర్టు నిర్వహించి వీరిలో నలుగురి గొంతు కోసి చంపారు. ఆ తర్వాత ఐదుగురిని విడుదల చేసి మిగతా వారిని సైతం హతమార్చడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మావోయిస్టులు ప్రజాకోర్టుల పేరిట మారణహోమం సృష్టిస్తుండటంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర