శుక్రవారం 27 నవంబర్ 2020
Crime - Oct 26, 2020 , 11:18:09

నాటు పడవ మునిగి ఇద్దరు మృతి

నాటు పడవ మునిగి ఇద్దరు మృతి

మంచిర్యాల : భీమారo మండలం  గొల్లవాగు ప్రాజెక్టు లో నాటుపడవ మునిగిన సంఘటన లో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ టాటా ఏసీ డ్రైవర్ , ఇరవేని రాజా బాపు (ట్రాలీ డ్రైవర్ ) ,కలవేని రమేష్ , మచ్చ రవి ,బొంతల రమేష్ క‌లిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు. నాటు పడవ స‌హాయంతో చెరువులోకి దిగారు. ప్ర‌మాద‌వ‌శాత్తు పడవ మునుగగా  బొంతల రమేష్ , ఇరవేని రాజబాపు ఇద్దరు గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గ‌ల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా సింగ‌రేణి రెస్క్యూ బృందం చ‌ర్య‌లు చేప‌ట్టింది.