గురువారం 21 జనవరి 2021
Crime - Jan 14, 2021 , 11:07:35

పురీష‌నాళంలో కిలో బంగారం

పురీష‌నాళంలో కిలో బంగారం

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు బుధ‌వారం త‌నిఖీలు చేశారు. త‌నిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు ప్ర‌యాణికుల వ‌ద్ద 1.42 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్ద‌రూ బంగారాన్ని పురీష నాళంలో దాచి ఉంచగా, త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డింది. ఈ బంగారం విలువ రూ. 72.6 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. బంగారంతో పాటు రూ. 12.4 ల‌క్ష‌ల విలువ చేసే సిగ‌రెట్లు, స్మార్ట్ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్, లిక్క‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్ర‌యాణికుల‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తాజావార్తలు


logo